‘వినాయక’ విడుదల ఎప్పుడు?

'వినాయక' విడుదల ఎప్పుడు?


సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖ నగరమంటే భక్తులకు వెంటనే గుర్తుకు వచ్చేది సంపత్‌ వినాయగర్‌ దేవాలయం. ఎంతో ప్రాశస్త్యం కలిగి భక్తుల కోర్కెలు తీర్చే మందిరంగా విలసిల్లుతోంది. 1962లో అశీలుమెట్‌ ప్రాంతంలో టి.ఎస్‌.రాజేశ్వరన్, టిఎస్‌.సెల్వగణేశన్, ఎస్‌.జి.సంబంధన్‌లు  సంపత్‌ వినాయగర్‌ దేవాలయాన్ని నిర్మించారు. పోర్ట్‌లో ట్రాన్స్‌పోర్ట్‌ వ్యాపారం చేసే ఆ ముగ్గురూ తమ వాహనాలకు ఎటువంటి ప్రమాదం కలగకుండా తొలుత ఇక్కడి వినాయకుడికి పూజలు నిర్వహించేవారు. కాలక్రమంలో భక్తుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. 1967లో కంచి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి ఆ దేవాలయంలో  శ్రీగణపతి యంత్రాన్ని స్థాపించి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేశారు. 1996లో ఎండోమెంట్స్‌ పరిధిలోకి వచ్చిన దేవాలయం కాలక్రమంలో అసిస్టెంట్‌ కమిషనర్‌ లేదా గ్రూప్‌–1 అధికారి పర్యవేక్షించే ప్రముఖ దేవస్థానంగా ఎదిగింది.